హత్యాయత్నం కేసులో తనపేరు ఉందని మనస్తాపం చెందిన వ్యక్తి... ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం నారాయణపురానికి చెందిన రామలింగయ్యపై... స్థల వివాదంలో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మనస్తాపానికి గురైన రామలింగయ్య ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేసు పెట్టారని ప్రాణం తీసుకున్నాడు..! - నారాయణపురంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
హత్యాయత్నం కేసులో తనపేరు ఉందనే మనస్తాపంతో... ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలంలో జరిగింది.
కేసు తీసిన ప్రాణం