ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ కలహాలు: కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం - Suicide attempt, including mother and son with family quarrels

కుటుంబ కలహాలతో తల్లి, కుమారుడు ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కర్నూలు నగరంలో కలకలం సృష్టించింది.

kurnool
కుటుంబ కలహాలతో తల్లి, కుమారుడుతో సహా ఆత్మహత్యాయత్నం

By

Published : Jun 24, 2020, 4:54 PM IST

కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన గృహిణి వాసవి.. తన మూడు సంవత్సరాల కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నగరంలోని బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న ఫ్లైఓవర్ పైనుంచి దూకిన ఆమెను.. సమీపంలోనే ఉన్న పోలీసులు గమనించారు.

గాయపడిన ఇద్దరిని... వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాసవి భర్త విశ్వనాథరెడ్డి ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబ కలహాలే.. ఆత్మహత్యాయత్నానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details