కర్నూలు జిల్లా పర్ల గ్రామానికి చెందిన పద్మావతికి నందికొట్కూరుకు వాసి నారాయణతో 15 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అత్తా కోడళ్ల మధ్య తరచూ గొడవ జరుగుండేది. దీంతో మనస్తాపానికి గురైన పద్మావతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన అత్త పుల్లమ్మ కాపాడడానికి వెళ్లగా ఆమెకూ మంటలంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరినీ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం కర్నూలుకు తరలించారు.
కోడలిని కాపాడబోయి అత్తకు గాయాలు - కర్నూలు జిల్లా నేరాలు
కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కోడలిని రక్షించే క్రమంలో.. అత్తకు మంటలంటుకుని గాయాలపాలైన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
నందికొట్కూరులో కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్యాయత్నం
ఇదీ చదవండి.భార్య కాపురానికి రాలేదని సెల్ టవర్ ఎక్కిన భర్త
Last Updated : Feb 12, 2020, 11:47 PM IST