ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైకోర్టు తీర్పును అమలు చేయని వైస్ ఛాన్స్​లర్.. విద్యార్థుల ధర్నా - రాయలసీమ విశ్వవిద్యాలయం వార్తలు

రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్​లర్.. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయటం లేదని విద్యార్థి సంఘం నాయకులు.. కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. విశ్వవిద్యాలయాల్లో రిజిస్ట్రార్​, డీన్, రెక్టర్ పోస్టులను తొలగించాలని కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా.. వారికే మద్దతిస్తున్నారని ఆరోపించారు.

students unions protest
students unions protest

By

Published : Apr 27, 2021, 9:12 PM IST


రాయలసీమ విశ్వవిద్యాలయంలో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘం నాయకులు.. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో హైకోర్టు తీర్పును అమలు చేస్తుండగా.. రాయలసీమ యునివర్సిటీ వైస్ చాన్స్​లర్ హైకోర్టు తీర్పును అమలు చేయటం లేదన్నారు. విశ్వవిద్యాలయాల్లో రిజిస్ట్రార్​, డీన్, రెక్టర్ పోస్టులను తొలగించాలని కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా.. వారికే మద్దతిస్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపంచారు. సంబంధిత అధికారులు స్పందించి ఇప్పటికైనా వారిని తొలిగించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details