Students reached vijayawada: ఉక్రెయిన్ నుంచి మరి కొంతమంది తెలుగు విద్యార్థులు క్షేమంగా వారి స్వస్థలాలకు చేరుకున్నారు. విజయవాడ విమానాశ్రయానికి ఆదివారం ఉదయం ఇద్దరు విద్యార్థులు రాగా... సాయంత్రం 7 గంటలకు మరో నలుగురు చేరుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన వైద్య విద్యార్థిని స్కందన హైదరాబాద్ చేరుకుంది. అక్కడినుంచి తమ స్వస్థలానికి అధికారులు క్షేమంగా తీసుకొచ్చారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులను చూసి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనైయ్యారు.
కళ్లకు కట్టినట్లు వివరించారు..
దిల్లీ నుంచి బెంగుళూరు వచ్చిన మదనపల్లికి చెందిన విద్యార్థులను రెవెన్యూ అధికారులు దగ్గరుండి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులను వారు కళ్లకు కట్టినట్లు వివరించారు. రాజధాని కీవ్‌లో విమానాలు రాకపోకలు ఆపేయడంతో 250 మంది విద్యార్థులు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ రాత్రిపూట మరో విమానాశ్రయానికి చేరుకున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంపై కృతజ్ఞతలు తెలిపారు.