ప్రభుత్వ హాస్టళ్లను ప్రారంభించాలని కర్నూలులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్ధులు ధర్నా చేశారు. ఖాళీ కంచాలు చేత పట్టుకొని నిరసన తెలిపారు. కరోనా నివారణ చర్యలు తీసుకుంటూ.. విద్యాసంస్థలు ప్రారంభించిన తరహాలోనే హాస్టళ్లు ప్రారంభించాలని కోరారు. వసతి గృహాలు ప్రారంభం కాకపోవటంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి హాస్టళ్లను ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్నాన్ని, అధికారులను హెచ్చరించారు.
హాస్టళ్లు తెరవాలని విద్యార్థులు ఆందోళన - Students protest under sfi news update
విద్యాసంస్థలు ప్రారంభించిన తరహాలోనే హాస్టళ్లు ప్రారంభించాలని కర్నూలులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పేద, మధ్య తరగతి విద్యార్ధులకు ఇబ్బంది అవుతున్న తరుణంలో త్వరగా హాస్టళ్లు ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.
హస్టళ్లు తెరవాలని విద్యార్ధులు ఆందోళన