విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతోపాటు ప్రత్యక్ష అనుభవాలు నేర్పుతున్నారు కర్నూలులోని కేవీఆర్ మహిళా కళాశాల అధ్యాపకులు. నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్-ఎన్ఏసీ ప్రోగ్రాంలో భాగంగా...2017లో కళాశాలలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. సేంద్రీయ ఎరువులు, వర్మీకంపోస్టుతో ఆకుకూరలు, కూరగాయలు పండించడంపై విద్యార్థులకు..అవగాహన కల్పిస్తున్నారు. వాటిని విద్యార్థులు వారి ఇళ్లలోనూ పండించేలా ప్రోత్సహిస్తున్నారు. పగలు తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థులు సాయంత్రం వేళ పంటల బాగోగులు....చూసుకుంటున్నారు. సేంద్రీయ సాగుపాఠాలపై సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
పట్టణాల నుంచి వచ్చిన విద్యార్థులూ...ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి చూపుతున్నారు. కలుపు తీయడం, నీరు పట్టడం వంటి విధానాలు నేర్చుకుంటున్నారు. విద్యార్థుల్లో ఆహారం, ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించాలనేది ఈ కార్యక్రమ ఉద్దేశం అంటున్నారు అధ్యాపకులు!. విద్యార్థులు బయటకు వెళ్లాక వారి పెరట్లో, మిద్దెలపై సాగు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.