కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చేటనేపల్లి గ్రామంలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వేసవి సెలవుల నేపథ్యంలో తోటి పిల్లలతో ఆదుకునేందుకు సమీపంలోని వ్యవసాయ బావిలోకి దిగారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయారు. ఇద్దరు పిల్లల మృతి తో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి