ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

PENCIL THEFT: పెన్సిల్ దొంగపై కేసు పెట్టండి.. పోలీసులకు బుడతడి అభ్యర్థన - pencil theft in peddakadaburu

సాధారణంగా చిన్న పిల్లలు పోలీసులను చూస్తేనే భయపడిపోతారు. వారి నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కర్నూలు జిల్లా పెద్దకడుబూరు గ్రామానికి చెందిన ఓ బుడతడు.. పెన్సిల్​ను తన స్నేహితుడు దొంగిలించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెన్సిల్​ను తస్కరించిన చిన్నారిని అరెస్టు చేయాలని పట్టుబట్టాడు. ఈ ఘటనతో ఆశ్చర్యపోయిన పోలీసులు..వారికి సర్దిజెప్పి అక్కడినుంచి పంపించేశారు.

పెన్సిల్ దొంగపై కేసు పెట్టండి...పోలీసులకు ఓ బుడతడి అభ్యర్థన
పెన్సిల్ దొంగపై కేసు పెట్టండి...పోలీసులకు ఓ బుడతడి అభ్యర్థన

By

Published : Nov 25, 2021, 4:51 PM IST

పెన్సిల్ దొంగపై కేసు పెట్టండి...పోలీసులకు ఓ బుడతడి అభ్యర్థన

కర్నూలు జిల్లాలో పెన్సిల్ పంచాయితీ మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు చేరింది. మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని పెద్దకడబూరుకు చెందిన ఇద్దరు చిన్నారుల మధ్య పెన్సిల్ కోసం పేచీ మొదలైంది. రోజూ తన బ్యాగులోని పెన్సిల్‌ దొంగతనం చేస్తున్నాడంటూ హనుమంతు అనే చిన్నారి తన స్నేహితుడు హనుమంతుతో తరచూ గొడవ పడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా పెన్సిల్ దొంగతనం(PENCIL THEFT ) ఆపడం లేదంటూ.. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. పెన్సిల్ దొంగతనం చేసిన స్నేహితుడిపై కేసు పెట్టాల్సిందేనని చిన్నారి హనుమంతు పట్టుబడ్డాడు. పోలీసులు సర్దిచెప్పినా వినలేదు. బాలుడి తీరుతో సరదాగా నవ్వుకున్న పోలీసులు.. వారికి నచ్చజెప్పారు. బాగా చదువుకోవాలని సూచిస్తూ అక్కడినుంచి పంపించివేశారు.

ABOUT THE AUTHOR

...view details