ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్ఆర్​సీని వ్యతిరేకిస్తూ ఆలూరు, నంద్యాలలో ధర్నా - Student unions dharna in Alur to oppose NRC

ఆలూరు, నంద్యాలలో ఎన్ఆర్సీ, క్యాబ్​లకు వ్యతిరేకంగా ముస్లింలు, సీపీఎం(ఐ) ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఆలూరులో విద్యార్థి సంఘాలు ధర్నా
ఆలూరులో విద్యార్థి సంఘాలు ధర్నా

By

Published : Dec 23, 2019, 5:48 PM IST

ఎన్ఆర్​సీని వ్యతిరేకిస్తూ... ఆలూరులో విద్యార్థి సంఘాలు ధర్నా

కర్నూలు జిల్లా ఆలూరులో ఎన్ఆర్సీ, క్యాబ్​లకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో ముస్లింలు ధర్నా చేశారు. మసీదు దగ్గర నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో ఈ చట్టాలను తీసుకు వచ్చిందన్నారు. ఇప్పటికైనా వాటిని ఉపసంహరించుకోవాలన్నారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామన్నారు. అందుకు కేంద్రమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నంద్యాలలో ధర్నా

నంద్యాలలో ర్యాలీ
నంద్యాలలో వామపక్ష పార్టీల విద్యార్థి సంఘాల నాయకులు పౌరసత్వ చట్ట సవరణ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయం ఎదుట రహదారిపై మానవహారం నిర్వహించారు. కేంద్రం నిర్ణయాలు ముస్లింలకు ఇబ్బందిగా ఉందని ఆరోపించారు. పౌరసత్వ చట్టంపై కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details