కర్నూలు జిల్లా మహానందికి చెందిన శివాజీ.. ఇటీవల పదోతరగతి ఉత్తీర్ణుడయ్యాడు. మహానందిలో ఇంటర్మీడియట్ చదవాలని తల్లిదండ్రులు సూచించగా.. నంద్యాలలో చదువుతానని శివాజీ చెప్పాడు. ఈ విషయంలో తల్లిదండ్రి, శివాజీ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో మనస్తాపం చెందిన శివాజీ...ఆలయ సమీపంలోని నీటి ట్యాంకు స్తంభానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నచ్చిన చోట చదవనీయడం లేదని విద్యార్థి ఆత్మహత్య - మహానంది నేర వార్తలు
కర్నూలు జిల్లా మహానందిలో విషాదం నెలకొంది. ఉరివేసుకుని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మహానందిలో విషాదం: మనస్తాపంతో బాలుడు ఆత్మహత్య