రాయలసీమ వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం - రాయలసీమ యూనివర్సిటీ వార్తలు
![రాయలసీమ వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం Student Suicide attempt at Rayalaseema university](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15096140-287-15096140-1650713632264.jpg)
16:40 April 23
పరీక్ష ఫీజు కట్టించుకోలేదని.. విద్యార్థి ఆత్మహత్యా యత్నం!
Student Suicide Attempt at Rayalaseema University: కర్నూలు జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. వర్సిటీలో మూడో సెమిస్టర్ ఫీజు కట్టించుకోలేదని మనస్తాపం చెందిన విద్యార్థి.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వర్సిటీ సిబ్బంది సమాచారంతో వచ్చిన పోలీసులు.. విద్యార్థిని అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. అయితే.. సదరు విద్యార్థి హాజరుశాతం తక్కువగా ఉన్నందునే ఫీజు కట్టించుకోలేదని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది.
ఇదీ చదవండి:Murder in palnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. నిన్న కిడ్నాప్, నేడు హత్య..!