కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన అరవింద్ (18) అనే విద్యార్థి ఎస్ఆర్బీసీ కాలువలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బనగానపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న అరవింద్.. గురువారం కళాశాల నుంచి ఇంటికి వచ్చి బయటికి వెళ్లిపోయాడు.
అనంతరం కనిపించకుండా పోయిన అరవింద్.. ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువలో శుక్రవారం శవమై కనిపించాడు. తమకు ఎలాంటి సమస్యలు లేవని తన కుమారుడు అరవింద్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని తండ్రి బాలస్వామి వెల్లడించారు, కేసు నమోదు చేసుకున్న బనగానపల్లె పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.