కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం అత్తను ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కమిషన్ ఛైర్మన్ జియా ఉద్దీన్ పరామర్శించారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఘటనకు పోలీసులే కారణమని సలాం బంధువులు అంటున్నారని తెలిపారు. కేసును లోతుగా శోధించి... బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే సలాం ఆత్మకు శాంతి కలుగుతుందని జియాఉద్దీన్ అన్నారు.
'సలాం కేసులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి' - సలాం కుటుంబం ఆత్మహత్య కేసు
సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అన్ని విధాలా దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఛైర్మన్ జియా ఉద్దీన్ అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ap minority commission