కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. అర్థరాత్రి వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసులైను వీధిలో నరసింహా అనే బాలుడు...ఇంటి నుంచి ఒంటరిగా బయటకు రాగా కుక్కలు మీదపడ్డాయి. ఒక్కసారిగా దాడి చేయడంతో బాలుడు...అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వచ్చి కుక్కలను ఆపేందుకు యత్నించినా...ఫలితం లేకుండా పోయింది. బాలుడిని....అతని తల్లి ఒంటరిగా వదలి...నంద్యాల వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
వీధి కుక్కల దాడిలో...నాలుగేళ్ల బాలుడు మృతి... - kurnool crime news
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో మంగళవారం అర్థరాత్రి నాలుగేళ్లబాలుడు మృతి చెందాడు.
వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి