కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నంద్యాల పట్టణంలోని కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మహానంది..
మహానంది మండలంలో పాలేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా మహానంది వ్యవసాయ కళాశాల, ఉద్యాన పరిశోధనా స్థలం, పశుపరిశోధనా స్థలం, గాజులపల్లి ఆర్ఎస్ గ్రామంలోని చెంచుకాలనీలోకి వరద నీరు వచ్చింది. బండి ఆత్మకూరు మండలంలోని నారాయణపురం, చిన్నదేవులపురం, లింగాపురం, రామాపురం, బీసీ పాలెం గ్రామాలను వరద చుట్టుముట్టింది.
కోవెలకుంట్ల..
కోవెలకుంట్ల మండలంలోని భీమునిపాడు ఎస్సీ కాలనీలోకి వర్షపు నీరు చేరింది. రుద్రవరం, గడివేముల మండలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.