కర్నూలును ఆనుకుని తుంగభద్ర నది ప్రవహిస్తోంది. నదిలోని ఇసుకను అమ్ముకుని పరివాహక ప్రజలు బతుకు పోరాటం చేస్తున్నారు. ఇసుకను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి రావటంతో అది కూడా పరిమితంగానే దొరుకుతోందని...ఫలితంగా ఇసుక కొరత తీవ్రంగా ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు..
కూలీల ఆవేదన...
తుంగభద్ర నదిలో కనుచూపు మేర ఇసుకను తవ్వితీసే వారే దర్శనమిస్తారు. నీరు బాగా ప్రవహించే సమయంలో ప్రమాదమని తెలిసినా పూర్తిగా నీటిలో మునిగి... ఇసుక ఎక్కడుందో గుర్తించి తవ్వి తీస్తున్నామని చెబుతున్నారు. నోటి దగ్గర కూడు తన్నుకుపోయినట్లు.... అంత కష్టపడి ఇసుకను తెస్తుంటే...పోలీసులు ఆపి జరిమానాలు విధిస్తున్నారని వాపోతున్నారు. కొందరు యజమానులు యువకులకు కూలీ ఇచ్చి లాభాలు ఆర్జిస్తున్నట్లు చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు.