కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కర్నూలు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్నాయి. మొత్తంగా జిల్లాలో ఇప్పటివరకూ పాజిటివ్ కేసులు 56కు పెరగిన కారణంగా... అధికారులు అప్రమత్తం అయ్యారు. కూరగాయలు, నిత్యావసర సరుకుల అమ్మకాలను నిలిపివేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులు... దాతలు ఇచ్చే భోజనం ప్యాకేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆసుపత్రి ముందు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తుండటంతో ఆకలి బాధ కారణంగా.. సామాజిక దూరం పాటించడం లేదు. ఈ నేపథ్యంలో వారి మధ్య దూరం ఉండేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్పొరేషన్ అధికారులు నగరంలో క్రిమి సంహారక ద్రావణం చల్లుతున్నారు.
కర్నూలులో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయ్!
కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 56కు పెరగటంపై అధికారులు కూరగాయలు, నిత్యావసర సరుకుల అమ్మకాలను నిలిపివేశారు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అప్రమత్తమైన కర్నూలు జిల్లా యంత్రాంగం