ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆస్తులను కాపాడుకోవటానికే విశాఖ ఉక్కుపై నోరు మెదపటం లేదు' - VISHKA STEEL PLANT NEWS

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి.. తమ ఆస్తులను కాపాడుకోవటానికే విశాఖ ఉక్కుపై నోరు మెదపటం లేదని తెదేపా నేత సోమిరెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. విశాఖ ప్లాంట్ అమ్మేస్తున్నట్లు సీఎం జగన్​కు చెప్పే చేస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారన్నారు.

తెలుగుదేశం నేత సోమిరెడ్డి వెంకటేశ్వర్లు
తెలుగుదేశం నేత సోమిరెడ్డి వెంకటేశ్వర్లు

By

Published : Mar 9, 2021, 4:50 PM IST

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిరసిస్తూ రాష్ట్రంలో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించటం లేదని తెలుగుదేశం విమర్శించింది. జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ తమ ఆస్తులను కాపాడుకోవటానికే విశాఖ ఉక్కుపై నోరు మెదపటం లేదని వ్యాఖ్యానించింది. పార్టీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విశాఖ ఉక్కును అమ్మేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్​కు చెప్పే చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. వైకాపా, భాజపా, జనసేన లాలూచీ పడ్డాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details