రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు - నిత్యవసర సరుకుల మార్కెట్ ధరలు
లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులను కొందరు వ్యాపారులు ఇష్టారీతన ధరలు పెంచి అమ్ముతున్నారు. ఈ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేలా.. ప్రభుత్వం సరుకుల ధరలను ఖరారు చేసింది. వాటి ప్రకారమే నిత్యావసర సరుకులు అమ్మాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ధరల వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. ఎక్కువ ధరలకు ఎవరైనా విక్రయిస్తే ప్రజలు 1902 కు నెంబర్కు ఫోన్ చేయాలని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల ధరలు
By
Published : Apr 15, 2020, 1:04 PM IST
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిత్యావసర సరుకుల ధరల పట్టికను నిర్ణయించారు. ఈ ధరలకే ప్రజలకు కూరగాయలను విక్రయించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. టోకు వర్తకులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ధరలు ఖరారు చేసినట్టు అధికారులు ప్రకటించారు.