కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో తాగు, సాగునీరు పుష్కలంగా లభిస్తుందని అన్నారు. దీనిద్వారా 80 వేల ఎకరాల వరకు సాగునీరు అందుతుందని తెలిపారు. సీఎం జగన్ రైతుల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.1660 కోట్ల నిధులు మంజూరు చేశారని చెప్పారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరారు.
వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన - వేదవతి ప్రాజెక్టు తాజా సమాచారం
కర్నూలులోని ఆలూరులో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం శంకుస్థాపన చేశారు. దీని ద్వారా 80 వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించవచ్చునని తెలిపారు.
వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన