రాష్ట్ర రెండవ రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయడమే అమరజీవి పొట్టి శ్రీరాములకు అందించే నిజమైన నివాళిగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్నూలులోని పొట్టి శ్రీరాముల పార్క్లో ఉన్న అమరజీవి విగ్రహానికి పూలమాల వేశారు.
పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగా రాజధాని కర్నూలులో ఏర్పడిందని... కానీ మూడేళ్లకే తెలంగాణకు రాజధాని తరలిపోయిందని అన్నారు. రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేసి, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు.