రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు వచ్చే నెల నుంచి మరమ్మతులు చేపడతామని రాష్ట్ర భవనాల, రహదారుల శాఖ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. మొదటి విడతగా మూడు వేల కోట్లకు టెండర్లు పూర్హి అయ్యాయని తెలిపారు. ఒక మండల నుంచి మరో మండలానికి కనెక్టివిటీ పెంచుతామని, కౌతాళం నుంచి గుత్తి వరకు జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని అన్నారు.
Minister Shankar Narayana: వచ్చే నెల నుంచి రోడ్ల మరమ్మతులు - రాష్ట్ర భవనాల, రహదారుల శాఖ మంత్రి
కర్నూలు జిల్లా ఆదోనిలో మంత్రి శంకర్ నారాయణ పర్యటించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వచ్చే నెల నుంచి మరమ్మతులు చేపడతామని తెలిపారు.
Minister Shankar Narayana
త్వరలో ఆదోనిలో పెండింగ్లో ఉన్న బైపాస్, రహదారుల మరమ్మతులు చేపడతామని వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోమంత్రి శంకర్ నారాయణ పర్యటించగా.. స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మంత్రితో పట్టణంలో పెండింగ్లో ఉన్న రోడ్డు పనులపై చర్చించారు.