ప్రకృతి వైపరీత్యాల కారణంగా మిర్చి పంటలో తగ్గిన దిగుబడులను పరిశీలించి రైతులకు తగిన న్యాయం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి అన్నారు. ప్రస్తుతం పంట పరిశీలన జరుగుతోందన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో జరిగిన మిర్చి రైతుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పంట నష్ట నివేదికను తెప్పించి ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
'మిర్చి దిగుబడులను పరిశీలించి రైతులకు న్యాయం చేస్తాం'
కర్నూలు జిల్లా పాండురంగాపురం గ్రామంలో జరిగిన మిర్చి రైతుల ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా తగ్గిన దిగుబడులను పరిశీలించి రైతలకు న్యాయం చేస్తామన్నారు.
రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి