ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలో లో 11 రోజులపాటు జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు మల్లికార్జునుడు, అమ్మవార్లు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ కన్నుల పండువగా శ్రీ స్వామి వారికి ఆలయ ప్రాంగణంలో ఉత్సవం నిర్వహించారు. నీలకంఠుడికి ఏకాంత సేవలు నిర్వహించిన ఆలయ అర్చకులు ఉత్సవాలకు స్వస్తి పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ముగిసిన మల్లిఖార్జునుడి బ్రహ్మోత్సవాలు - బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరిరోజు నీలకంఠుడు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు.
శ్రీశైలం