ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలంలో జలకళ - ap floods

కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు పూర్తిగా నిండిపోయి ఉరకలెత్తుతున్నాయి. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ఉద్ధృతి

By

Published : Aug 3, 2019, 7:51 AM IST

Updated : Aug 3, 2019, 11:47 AM IST

కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలంలో జలకళ

ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి జలాశయానికి వరద స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులు కాగా... ప్రస్తుతం 1700.59 అడుగులతో నిండుకుండలా మారింది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా 106.83 టీఎంసీల నీటిని కొనసాగిస్తున్నారు. జలాశయంలో 2,02,400 క్యూసెక్కుల నీరు చేరుతుండగా... 2,30,207 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయానికి వరద స్వల్పంగా పెరిగింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1615 అడుగులు కాగా... ప్రస్తుతం 1610.70 అడుగుల నీరు ఉంది. నారాయణపూర్ పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా... 31.85 టీఎంసీల నీటితో జలకళను సంతరించుకుంది. జలాశయంలో 2,40,135 క్యూసెక్కుల నీరు చేరుతుండగా... 2,10,128 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయానికి వరద క్రమంగా పెరుగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 1044.39 అడుగులు. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా... 9.28 టీఎంసీల నీటి నిల్వతో... నిండుగా మారింది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 2,05,000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,08,278 క్యూసెక్కులు.

తెలుగు రాష్ట్రాలకు జీవనాడి అయిన శ్రీశైలం జలాశయంలో భారీగా వరద నీరు చేరుతోంది. నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయంలో ప్రస్తుతం 1,98,789 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 846అడుగుల మేర నీరు ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 72.04టీఎంసీల నీరు నిల్వ ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

అయితే ఇంతవరకు నాగార్జునసాగర్​కు వరద నీరు చేరటం లేదు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 506.80 అడుగుల నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా... 126.30 టీఎంసీల నీరు కొనసాగుతోంది.

తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 30.96 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జలాశయంలో 17,293 క్యూసెక్కుల నీరు చేరుతుండగా... కాల్వల ద్వారా 1233 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Last Updated : Aug 3, 2019, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details