కర్నూలు జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నిరసన సెగ తగిలింది. శ్రీశైలం నుంచి కర్నూలు వస్తున్న ఆయన్ను నందికొట్కూరులో బాధితులు అడ్డుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపు బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 60 రోజులుగా దీక్షలు చేస్తున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రం సమర్పించారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం తమ భూములు ఇచ్చామని... 40 ఏళ్లుగా ప్రభుత్వాలు న్యాయం చేయటం లేదని ఆవేదన చెందారు. తమకు ఉద్యోగాలు కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
మంత్రి అనిల్‌కు నిరసన సెగ... కాన్వాయ్ అడ్డగింత - srisailam flood victims
కర్నూలు జిల్లా నందికొట్కూరులో మంత్రి అనిల్ కుమార్ కాన్వాయ్ ను ప్రజలు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని శ్రీశైలం ముంపు బాధితులు వేడుకున్నారు.

మంత్రి అనిల్‌కు నిరసన సెగ... కాన్వాయ్ అడ్డగింత
మంత్రి అనిల్‌కు నిరసన సెగ... కాన్వాయ్ అడ్డగింత