ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద - srisailam water fall latesr updates

ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, హంద్రీ నది నుంచి 75,936 క్యూసెక్కులు వస్తోంది. ఇప్పటికే 1,35,890 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరింది.

srisailm dam water  flow still growing
srisailm dam water flow still growing

By

Published : Aug 16, 2020, 6:00 PM IST

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరి నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం జలాశయానికి లక్షా 35 వేల 890 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతోందని అధికారులు వెల్లడించారు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ... 42 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నామని తెలిపారు.

శ్రీశైలం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 870.20 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి నిల్వ 143.30 టీఎంసీలుగా నమోదైంది. వరద ప్రవాహం ఇదే విధంగా భారీగా కొనసాగితే... వారం రోజుల్లో జలాశయం పూర్తిగా నిండే అవకాశం ఉందని శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ అధికారులు అంచనా వేశారు.

ABOUT THE AUTHOR

...view details