ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 862.80 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 114.7420 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ..40,259 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం నుంచి హంద్రీనీవాకు 1350 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి 3,917 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం - srisailam water fall today outflow
శ్రీశైలం జలాశయానికి వరద ఉద్దృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 1,91,080 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుత నీటిమట్టం 862.80 అడుగులుగా ఉంది.
srisailam water fal today inflow outflow information