శ్రీశైల దేవస్థానంలో దర్శనం, అభిషేకం టికెట్ల కుంభకోణం కేసులో శాశ్వత, పొరుగు సేవల ఉద్యోగులపై వేటు పడింది. శాశ్వత ఉద్యోగుల పర్యవేక్షకులు సీహెచ్.మధుసూదన్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఎం.రామానాయుడు, హెల్పర్ జె.వి.నరసింహులును సస్పెండ్ చేస్తూ ఈఓ రామారావు ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు ఆరుగురు ఒప్పంద ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు ఈఓ పేర్కొన్నారు. అభిషేకం టికెట్ల కౌంటర్లలో పనిచేసి అక్రమాలకు పాల్పడిన అభ్రిపో ఏజెన్సీ తరఫున 10 మంది, వీరభద్ర ఏజెన్సీ తరఫున 6 మందిని విధుల నుంచి తొలగించామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏఈఓలు, పర్యవేక్షకులు, సీనియర్, జూనియర్, రికార్డు అసిస్టెంట్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఈఓ తెలిపారు.
శ్రీశైలం ఆలయ ఉద్యోగులపై వేటు - news on srisailam temple employee suspension
టికెట్ల కుంభకోణం కేసులో ఆలయ ఉద్యోగులపై శ్రీశైలం దేవస్థానం చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారంలో ముగ్గురు శాశ్వత ఉద్యోగులపై ఆలయ ఈవో సస్పెన్షన్ వేటు వేశారు.
శ్రీశైల దేవస్థాన ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్
Last Updated : Jun 5, 2020, 4:37 AM IST