శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేస్తామని ఆత్మకూరు డీఎస్పీ, ప్రత్యేక విచారణ అధికారి వెంకట్రావు తెలిపారు. బ్యాంకుల తరఫున పని చేసిన పొరుగు సేవల ఉద్యోగులు యూజర్ ఐడీ, పాస్వర్డ్లతో టికెట్లను అక్రమంగా విక్రయించి అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. 20 మంది నిందితులపై 403, 420, 409 రెడ్ విత్ ఐపీసీ, 65,66 ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు.
'శ్రీశైలం దేవస్థానం అవినీతిపై సమగ్ర దర్యాప్తు'
శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేస్తామని ప్రత్యేక విచారణాధికారి వెంకట్రావు తెలిపారు. నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు.
'శ్రీశైలం దేవస్థానం అవినీతిపై సమగ్ర దర్యాప్తు'