శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుతోంది. డ్యాము 4 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి 2.56 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ప్రస్తుత నీటిమట్టం 883.80 అడుగులు కాగా... నీటినిల్వ 208.7210 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుదుత్పత్తి, స్పిల్‌వే ద్వారా 2.87లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలానికి వరద తగ్గుముఖం..4 గేట్ల ద్వారా నీటి విడుదల - శ్రీశైలం జలాశయం తాజ వార్తలు
ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం 4 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు.
శ్రీశైలం జలాశయం 4 గేట్ల ఎత్తి దిగువకు నీటి విడుదల