శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో.. 1, 63, 245 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతోంది. ఔట్ ఫ్లో.. 2, 63, 809 క్యూసెక్కులుగా ఉంది. 6 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయం ప్రస్తుత నీటినిల్వ 211.4579 టీఎంసీలుగా కొనసాగుతోంది.
శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసి అదనంగా 30,641 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 1,66,524 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.30 అడుగులుగా ఉంది.