శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద క్రమంగా పెరుగుతోంది. జలాశయానికి 2,50,680 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా... ఎనిమిది గేట్లు ఎత్తి 2,23,128 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 213.40 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉంది.
శ్రీశైలం జలాశయానికి వరద... ఎనిమిది గేట్లు ఎత్తి నీటి విడుదల - కర్నూలు వార్తలు
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తోంది. ఫలితంగా అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి వరద... ఎనిమిది గేట్లు ఎత్తి నీటి విడుదల
Last Updated : Sep 11, 2020, 7:58 PM IST