శ్రీశైలం జలాశయం ప్రమాదంలో ఉందని భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలాశయంపై స్పందించాలని కోరారు. జలాశయం భద్రతపై ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ చూపటం లేదో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయంపై భాజపా ఆధ్వర్యంలో త్వరలో శ్రీశైలంలో మహాధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పందించిన ఆయన... కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల నిర్వహణ సరికాదన్నారు. వైరస్ తగ్గుముఖం పట్టాక స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
'శ్రీశైలం జలాశయం ప్రమాదంలో ఉంది.. తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించాలి' - శ్రీశైలం జలాశయం తాజా వార్తలు
శ్రీశైలం జలాశయం ప్రమాదంలో ఉందని.. ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించాలని భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత తరుణంలో స్థానిక ఎన్నికలు నిర్వహించటం సరికాదని అభిప్రాయపడ్డారు.
శ్రీశైలం జలాశయం ప్రమాదంలో ఉంది