కృష్ణానదిలో తగ్గిపోయిన వరద ప్రవాహం-గేట్లన్నీ మూసివేత - కృష్ణానదిలో తగ్గిపోయిన వరద ప్రవాహం
కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గిపోయింది. శ్రీశైలానికి కేవలం 59 వేల క్యూసెక్కుల ప్రవాహిస్తోంది. శ్రీశైలం నుంచి 98 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జలాశయం స్పిల్వే గేట్లన్నీ మూసివేశారు.
srisailam-project-water-flow
కృష్ణానదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా తగ్గిపోయింది.శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహాలు పూర్తిగా పడిపోవడంతో.....జలాశయం స్పిల్ వే గేట్లు అన్నీ మూసివేశారు.జలాశయానికి కేవలం59వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.తెలుగు రాష్ట్రాల అవసరాల కోసం98వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం885అడుగులు కాగా...ప్రస్తుతం జలాశయంలో884.50అడుగుల నీటిని నిల్వ ఉంది.జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం215.81టీఎంసీలు కాగా...ప్రస్తుతం212. 91టీఎంసీల నీటి నిల్వ చేశారు.