జీఓ నెంబర్ 98 మేరకు శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు ఉద్యోగాలు కల్పించాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వాసితులు ఆందోళన చేశారు. నిర్వాసితులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలపడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది.
జీఓ 98 కింద ఉద్యోగాలు కోరుతూ.. శ్రీశైలం ముంపు బాధితుల ధర్నా - ఉద్యోగాలు కోరుతూ శ్రీశైలం ప్రాజెక్టు ముంపు భాదితులు నిరసన
ప్రభుత్వం ఇచ్చిన జీఓ నెంబర్ 98 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాదితులకు ఉద్యోగాలు కల్పించాలని కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఆందోళన కారులను పోలీసులు అక్కడి నుంచి స్టేషన్కు తరలించారు.
శ్రీశైలం ముంపు బాధితుల ధర్నా
జీఓ 98 ప్రకారం నష్టపోయిన కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని.. ఇంకా 674 మందికి ఇప్పటికీ ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా తమకు న్యాయంచేయాలని వారు కోరారు. ప్రభుత్వం నుంచి తమకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినా.. అధికారులు వాటిని అమలు పరచడం లేదంటూ ఆక్షేపించారు.
ఇదీ చదవండి:కర్నూలు జిల్లాలో కన్నుల పండువగా భోగి మంటలు