శ్రీశైల మహాక్షేత్రంలో జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహా స్వామి... 200 మంది పేదలకు కిరాణం సరుకులు కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు, మంచినూనెతో పాటు 13 రకాల సరుకులను అందజేశారు. లాక్ డౌన్ కారణంగా పేదలు ఆహారానికి ఇబ్బంది పడకూడదని జగద్గురు పీఠం సేవా సమితి తరఫున పేదలకు సరుకులను అందజేసినట్లు ఆయన తెలిపారు. దేశ ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలన్న సంకల్పంతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేస్తున్నామన్నారు.
శ్రీశైల పీఠాధిపతి ఆధ్వర్యంలో సరకుల పంపిణీ - శ్రీశైలంలో కరోనా
లాక్ డౌన్ కారణంగా పేదలు ఆహారానికి ఇబ్బంది పడకూడదని శ్రీశైల మహాక్షేత్రంలో జగద్గురు పీఠాధిపతి.. నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలన్న సంకల్పంతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
శ్రీశైల పీఠాధిపతి ఆధ్వర్యంలో సరకుల పంపిణీ