శ్రీశైలం దేవస్థానం టికెట్ల కుంభకోణంతో తనకు, తన బంధువులకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించవచ్చని భాజపా నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డికి సవాల్ విసిరారు.
నిరూపిస్తే... రాజకీయ సన్యాసం చేస్తా : శిల్పా చక్రపాణి రెడ్డి - బైరెడ్డి వ్యాఖ్యలపై శిల్పా చక్రపాణి కౌంటర్
శ్రీశైలం టికెట్ల స్కాంతో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని వైకాపా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. భాజపా నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేసిన విమర్శలపై స్పందించిన ఆయన.. శ్రీశైలం వ్యవహారంలో సీబీఐ విచారణకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.
శిల్పా చక్రపాణి రెడ్డి
కర్నూలు జిల్లా నంద్యాలలో మాట్లాడిన ఆయన... తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులకు అభ్యంతరం చెబితే తెలంగాణ ప్రాజెక్టులపై తాము ఫిర్యాదు చేస్తామన్నారు.
ఇదీ చదవండి : 'రంగు... స్టిక్కర్... పేరు... మీ ఏడాది పాలన ఇదేనా?'