ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సున్నిపెంటలో కొవిడ్ వ్యాక్సినేషన్​ను ప్రారంభం - kurnool district latest news

కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్-19 టీకా వ్యాక్సినేషన్​ను​ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ప్రారంభించారు. అనంతరం స్థానిక పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.

srisailam mla shilpa chakrapani reddy
సున్నింపెంటలో కొవిడ్ వాక్సినేషన్

By

Published : Jan 21, 2021, 1:27 PM IST

కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట ప్రాజెక్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్-19 టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. ఆసుపత్రి సిబ్బందికి ఎమ్మెల్యే సమక్షంలో టీకాలు వేశారు. 100 మంది సిబ్బందికి కొవిడ్ నివారణ టీకాలు వేయనున్నట్లు వైద్యులు తెలిపారు.

అనంతరం... సున్నిపెంటలో పూర్తైన పలు అభివృద్ది పనులను పరిశీలించారు. బస్టాండ్ సర్కిల్ నుంచి కుమార స్వామి ఆలయం వరకు కార్యకర్తలతో ర్యాలీగా తరలివెళ్లారు. ఆ ప్రాంతంలోని పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details