ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శ్రీశైలం దేవస్థానంలో మా బంధువులెవరూ లేరు' - కర్నూలు జిల్లా వార్తలు

శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అక్రమాలకు తనకు ఎటువంటి సంబంధం లేదని వైకాపా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. దేవస్థానంలో తన బంధువులు ఉన్నారన్న విమర్శలు అవాస్తవమన్నారు. టికెట్ల సొమ్ము పక్కదారి పట్టడంపై పూర్తి విచారణ చేపట్టాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. భాజపా నేతలు కావాలనే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు.

Srisailam mla chakrapani reddy
Srisailam mla chakrapani reddy

By

Published : May 29, 2020, 8:03 AM IST

శ్రీశైలం దేవస్థానంలో తన బంధువులు లేరని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. దేవస్థానంలో జరిగిన అక్రమాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. టికెట్ల అక్రమాలపై విజిలెన్స్, సీఐడీ విచారణ చేయించాలని కోరినట్లు స్పష్టం చేశారు.

ఈ విషయంపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించి, దేవాదాయశాఖ సహాయ కమిషనర్​తో పాటు, కర్నూలు ఎస్పీ ఆదేశాలతో ఆత్మకూరు డీఎస్పీతో ప్రత్యేకంగా విచారణ చేయిస్తున్నట్లు చెప్పారు. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. రాజకీయ దురుద్దేశంతోనే భాజపా నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి :మహానాడు 2020 విజయవంతం : కాల్వ శ్రీనివాసులు

ABOUT THE AUTHOR

...view details