శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 3 లక్షల 98 వేల769 క్యూసెక్కులు... ఔట్‌ఫ్లో 4లక్షల 32వేల 026 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం 10 గేట్లు ఎత్తి 3 లక్షల 71 వేల 230 క్యూసెక్కులు విడుదల చేశారు.
పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 883.30 అడుగులుగా ఉంది. జలాశయం నీటి నిల్వ పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలుగా ఉండగా... ప్రస్తుత నీటి నిల్వ 206.09 టీఎంసీలుగా నమోదైంది.