శ్రీశైలంలో దసరా మహోత్సవాలు..విద్యుద్దీపాలతో ఆలయం ముస్తాబు - undefined
దసరా మహోత్సవాలకు శ్రీశైల మహాక్షేత్రం సిద్ధమైంది. వేడుకల కోసం శ్రీగిరి క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ వీధులు రంగురంగుల కాంతులీనుతున్నాయి. ఉదయం 9 గంటలకు భ్రమరాంబదేవి ఆలయ ప్రాంగణంలో.... దేవస్థానం ఈవో రామారావు, ఆలయ అర్చకులు.... శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం అమ్మవారు భక్తులకు శైలపుత్రి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. అనంతరం భృంగి వాహనంపై గ్రామోత్సవం జరగనుంది.
srisailam_dussera mahostavalu
.