శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత.. ఒక గేటు పైకెత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రాజెక్టు అధికారులు క్రమంగా 10 గేట్లు ఎత్తనున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.50 అడుగులకు చేరింది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.11 టీఎంసీలకు నీరు చేరింది. జలాశయంలో 4 లక్షలా 65 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా... రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి సహా ఇతర పథకాలకు 80 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేసే అవకాశం ఉంది. 2007 తర్వాత మళ్లీ జులైలో శ్రీశైలం నిండి నీటిని విడుదల చేసే పరిస్థితి రావడం ఇదే తొలిసారి.
srisailam dam: నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. గేట్లు ఎత్తే అవకాశం - శ్రీశైలం జలాశయానికి వరద నీరు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.50 అడుగులకు చేరింది. సాయంత్రం ఆరు గంటల తర్వాత గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
srisailam dam water level