కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 1.51 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయ నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఆనకట్ట ఆరు గేట్లను పది అడుగుల మేర పైకెత్తి 1.60 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేస్తూ.. అదనంగా 68 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టికి వరద కొనసాగుతుండడం వల్ల నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి.
శ్రీశైలానికి భారీ వరద.. 6 గేట్లు ఎత్తి నీటి విడుదల
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఆనకట్ట ఆరు గేట్లను పది అడుగుల మేర పైకెత్తి 1.60 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. ఈ సీజన్లో నీటి విడుదల ఇది నాలుగోసారి.
శ్రీశైలంలో వరద ప్రవాహం