ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం మహాక్షేత్రాన్ని దర్శించుకున్న ఉపాసన - శ్రీశైలం మహాక్షేత్రం వార్తలు

లాక్​డౌన్ సడలింపుల అనంతరం దేవాలయాలన్నీ తెరుచుకున్నాయి. ఈ మేరకు శ్రీశైలం మహాక్షేత్రాన్ని సినీ నటుడు రామ్​చరణ్​ భార్య ఉపాసన దర్శించుకున్నారు. అనంతరం 115 మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

srisailam-bhramaramba-mallikarjuna-swamy-temple-visitted-by-upasana-kurnoll-district
srisailam-bhramaramba-mallikarjuna-swamy-temple-visitted-by-upasana-kurnoll-district

By

Published : Jun 9, 2020, 5:53 PM IST

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను హీరో రామ్​చరణ్ సతీమణి ఉపాసన దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన ఆమెకు ఆలయ ఈవో కె.ఎస్.రామారావు స్వాగతం పలికారు. శ్రీశైలం సమీపంలోని లింగాల గట్టు సమీపంలో అటవీశాఖ ప్రొటెక్షన్ వద్ద 115 మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 50 కేజీల బియ్యం, కిరాణా సరకులు అందజేసి... తన సేవా భావాన్ని చాటుకున్నారు.

నిత్యావస సరకులు పంచుతున్న ఉపాసన

మాస్కు ధరించి వచ్చిన ఆమె... స్వామివారి దర్శనం అనంతరం సిబ్బందికి నమస్కరిస్తూ తిరిగి వెళ్లారు. ఆమెతో స్థానిక ఉద్యోగులు కొందరు ఫొటోలు దిగారు. ఉపాసన తరచూ శ్రీశైలం వస్తుండగా... లాక్​డౌన్ సడలింపు ఇవ్వగానే ఆమె దర్శనానికి రావడం విశేషం.

సిబ్బందితో మాట్లాడుతున్న ఉపాసన

ఇదీ చదవండి:ఆ సినిమాలో వర్షం సీన్ల కోసం ఆరేళ్లు షూటింగ్​!

ABOUT THE AUTHOR

...view details