ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MLA SHILPA CHAKRAPANI REDDY: 'వర్ధన్ బ్యాంకు అక్రమాలతో నాకెలాంటి సంబంధమూ లేదు' - vardhan bank irregularities

వైకాపా ఎస్సీ సెల్​ అధ్యక్షుడి కారణంగానే వర్ధన్ బ్యాంకు ప్రారంభోత్సవానికి వెళ్లినట్లు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. తనకు బ్యాంకులో జరుగుతున్న అక్రమాలకు ఎటువంటి సంబంధం లేదని వివరించారు.

srisaialm-mla-shilpa-chakrapanireddy-comments-on-vardhan-bank-irregularities
'వర్ధన్ బ్యాంకు అక్రమాలకు నాకు ఏ సంబంధమూ లేదు'

By

Published : Oct 26, 2021, 10:47 AM IST

'వర్ధన్ బ్యాంకు అక్రమాలకు నాకు ఏ సంబంధమూ లేదు'

వర్ధన్ బ్యాంక్ అక్రమాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. నంద్యాల పార్లమెంట్ వైకాపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాలన్న పిలవడం వల్లే ఆత్మకూరులో వర్ధన్ బ్యాంకు బ్రాంచ్ ప్రారంభోత్సవానికి వెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆ కార్యక్రమంలో వారు మాట్లాడాలని కోరితేనే మాట్లాడినట్లు ఆయన స్పష్టం చేశారు. అయినా మోసపోయిన వాళ్లంతా వైకాపా వాళ్లేనని పేర్కొన్నారు.

ఈ వివాదానికి కారణమైన వైకాపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాలన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. వర్ధన్ బ్యాంకు అక్రమాల్లో ఎంతటి వారి పాత్ర ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం..ప్రభుత్వ ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details