కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు.. శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేద్రతీర్థులు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఆ ఉత్సవాలు నేటి నుంచి ఆరు రోజుల పాటు జరుగనున్నాయి. 15న శ్రీ రాఘవేంద్ర స్వామి 400వ పట్టాభిషేకోత్సవం, 20న స్వామివారి 426వ జన్మదిన కార్యక్రమాలను ఆలయ అధికారులు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా... బెంగళూరుకు చెందిన కృష్ణమూర్తి అనే భక్తుడు విరాళంగా ఇచ్చిన కోటి రూపాయలతో నిర్మించిన 32 అడుగుల ఆభయ ఆంజనేయ స్వామి ఏక శిలా విగ్రహాన్ని సుభుదేంద్ర తీర్థులు ప్రారంభించారు. గురుభక్తి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా కర్నాటక హైకోర్టు జడ్జీలు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ శ్రీషానందా, జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ హాజరయ్యారు. స్వామి వారి మూల బృందావనానికి ఉదయం నుంచే వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.