కర్నూలు జిల్లా అహోబిలం శ్రీలక్షీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారు చంద్రప్రభవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో సింహవాహనంపై విహరిస్తూ మఠం చేరుకున్నారు. 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ మహాదేశికన్... స్వామివారికి విశేష పూజలు చేశారు. అలాగే.. సోమవారం వేకువఝామున స్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాల నరసింహమూర్తి శేష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
చంద్ర ప్రభవాహనంపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం - అహోబిలం బ్రహ్మోత్సవాల న్యూస్
అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు చంద్ర ప్రభవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
చంద్రప్రభవాహనంపై దర్శనమిచ్చన శ్రీ లక్ష్మీనరసింహస్వామి