వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గ్రామోత్సవం - kurnool district updates
కర్నూలు జిల్లా నంద్యాలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.
![వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గ్రామోత్సవం sri lakshmi narasimhaswamy gramotsavam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11118563-286-11118563-1616463821165.jpg)
వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గ్రామోత్సవం
వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గ్రామోత్సవం
కర్నూలు జిల్లా నంద్యాల మండలం మూలసాగరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన ఆహోబిలంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో మూలసాగరం గ్రామస్థులు అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎద్దుల బండితో ఆహోబిలం వెళ్లే తరుణంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి